మళ్లీ ఐపీఎల్‌లో సత్తా చాటుతా: యశ్ దయాల్‌

క‌లం, స్పోర్ట్స్: ఐపీఎల్ 2027 సీజన్‌కు ఆర్సీబీ తనను రిటైన్ చేయడం యశ్ దయాల్‌ (Yash Dayal)కు ఆశ్చర్యం కలిగించింది. తనను జట్టు కొనసాగిస్తుందని ఊహించలేదని తెలిపాడు. ఆర్సీబీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పాడు. 2025లో ఆర్సీబీ టైటిల్ గెలవడంలో దయాల్ కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో 15 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు తీశాడు. అయితే న్యాయపరమైన సమస్యల కారణంగా 2026 సీజన్‌కు దూరమయ్యాడు. టీవీలో సహచరులు ఆడుతుంటే బాధ కలిగిందని, ఇప్పుడు మళ్లీ మైదానంలోకి రావడం సంతోషంగా ఉందని తెలిపాడు.

ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ తరఫున ఆడుతున్న దయాల్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో నాలుగు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు పడగొట్టాడు. జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రెండు వికెట్లు తీశాడు. తన తదుపరి లక్ష్యం టీమిండియాకు ఆడటమేనని దయాల్ స్పష్టం చేశాడు. కోల్పోయిన సమయాన్ని భర్తీ చేసుకుంటూ, వీలైనంత త్వరగా భారత జట్టులో చోటు సంపాదించాలని భావిస్తున్నాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>