తిలక్ వర్మ పేరిట చెత్త రికార్డు!

క‌లం, స్పోర్ట్స్: సెంచరీ కొట్టినా జట్టును గెలిపించలేకపోయాడు. పైగా ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో పాకిస్థాన్-ఏతో జరిగిన మ్యాచ్‌లో భారత్-ఏ కెప్టెన్ తిలక్ వర్మ (Tilak Varma) 148 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత నెమ్మదిగా సెంచరీ చేసిన భారత ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో మనోజ్ ప్రభాకర్ 151 బంతులతో అగ్రస్థానంలో ఉన్నాడు. 314 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్-ఏకు అభిషేక్ శర్మ మెరుపు ఆరంభం ఇచ్చాడు. కేవలం 42 బంతుల్లోనే 70 పరుగులు చేశాడు. ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదాడు.

మరోవైపు తిలక్ మాత్రం ఆరంభం నుంచే నెమ్మదిగా ఆడాడు. 95 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అభిషేక్ ఔటైన తర్వాత భారత జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో షాబాజ్ అహ్మద్‌తో కలిసి తిలక్ ఏడో వికెట్‌కు 112 పరుగులు జోడించాడు. షాబాజ్ 56 పరుగులు చేశాడు. అయితే అతడు ఔటైన తర్వాత భారత ఇన్నింగ్స్ వేగంగా ముగిసింది. చివరకు భారత్-ఏ 49.1 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌటైంది. దీంతో పాకిస్థాన్-ఏ 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. తిలక్ సెంచరీ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. అతడి నెమ్మదైన ఇన్నింగ్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>