కొబ్బరికాయలు అమ్ముతూ నిరుద్యోగుల నిరసన

కలం, యాదగిరిగుట్ట : ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట (Yadagirigutta) దేవస్థానంలో కొండపైన వర్తక సంఘాన్ని రద్దు చేయాలని బుధవారం యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు కొండపైన కొబ్బరికాయలు అమ్ముతూ నిరసన వ్యక్తం చేశారు. కొండపైన ఆలయ అభివృద్ధి సమయంలో తొలగించిన దుకాణాలను వర్తక సంఘం పేరుతో ఏర్పాటు చేసుకొని కొన్ని సంవత్సరాలుగా టెండర్లు వేయకుండా రెన్యువల్ చేసుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నో సంవత్సరాలుగా తిష్ట వేసుకుని కొండపైన దుకాణాలు కొనసాగిస్తూ వర్తక సంఘం పేరిట దేవస్థానం ఆదాయానికి గండి కొడుతున్నారని మండిపడ్డారు.

అయితే కొండపైన దుకాణాలకు టెండర్లు వేస్తే 20 నుండి 30 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని తెలిపారు. కాబట్టి తక్షణమే వర్తక సంఘం పేరుతో నడుపుతున్న దుకాణాలను రద్దుచేసి టెండర్ల ద్వారా దుకాణాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. మన గుడి – మన వ్యాపారం పేరుతో యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులు కొండపైన కొబ్బరికాయలు అమ్ముతూ నిరసనకు చేపట్టగా.. పోలీసులు కమిటీ సభ్యులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఉదయం కొందరిని పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ కార్యక్రమంలో కాటబత్తిని ఆంజనేయులు, ముక్కెర్ల వెంకటేష్,ముక్కెర్ల శ్రీకాంత్ చిన్నరాజు, ఆరేస్వామి, బండ రామస్వామి, దండ బోయిన వీరేష్, బండి వాసు, పల్లపు బాలయ్య, కర్రే ప్రవీణ్, బండి అనిల్, కొన్నే సంజీవ, గుండ్లపల్లి లింగం, బండి అనిల్, బుగ్గ ఆంజనేయులు, దొమ్మాట ప్రభాకర్, గోపగాని ప్రసాద్, స్వర్గం నరేష్, సుదగాని శివ, ఆవుల రాజు, ముక్కెర్ల నరసింహ, మందోజ్ నరేష్, కర్రె శ్యామ్ తదితరులున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>