దేశ చరిత్రను తిరగరాసిన నేత రాజీవ్ గాంధీ : యెన్నం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో :  దేశ చరిత్రను తిరగరాసిన నాయకుడు రాజీవ్ గాంధీ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) పేర్కొన్నారు. భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మహబూబ్‌నగర్ అశోక్‌టాకీస్ చౌరస్తా వద్ద ఉన్న రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ యువప్రధానిగా దేశానికి కొత్త దిశ చూపించారని పేర్కొన్నారు. ఆయన కండ్లల్లో ప్రేమ, మాటల్లో మృదుత్వం, వ్యక్తిత్వంలో హుందాతనం స్పష్టంగా కనిపించేవన్నారు.

దేశ పునర్నిర్మాణానికి కృషి

తల్లి ఇందిరా గాంధీ హత్య అనంతరం దేశం కష్టాల్లో ఉన్న సమయంలో బాధను జీర్ణించుకుని ప్రజలను ఏకం చేసి దేశ పునర్నిర్మాణానికి ఆయన కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన పాలనలో దేశ ఐక్యతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారని, నాగాలాండ్, మిజోరాం, మణిపూర్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి చర్చలు జరిపి, ప్రజలకు గౌరవం కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు.

దేశాభివృద్ధికి పునాది

దేశాభివృద్ధికి పునాది వేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారని, పంచాయతీ‌రాజ్ వ్యవస్థ బలపరిచి, స్థానిక సంస్థలకు అధికారాల వికేంద్రీకరణ, కంప్యూటర్, సాంకేతిక రంగాలకు ప్రోత్సాహం ఇచ్చారని గుర్తు చేశారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, నగర మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారే పల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, సిరాజ్ ఖాద్రీ, ఎస్సీ సెల్ చైర్మన్ సాయిబాబా, సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యనిర్వహక అధ్యక్షులు అజ్మత్ అలి, కార్పొరేటర్లు రమేష్ రెడ్డి, పెద్ద గొల్ల నర్సింహులు, గులాం జహీర్, రమేష్ బాబు, ప్రశాంత్ , నాయకులు బీ మోహన్ బాబు, రియాజ్, అంజద్, గోవింద్ యాదవ్, తెలుగు గూడెం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>