అమరవీరుల త్యాగానికి గుర్తుగా.. రామన్నపేట రోడ్లపై పోలీసుల 2K రన్!

కలం, యాదగిరిగుట్ట: పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ.. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసు శాఖ రామన్నపేట (Ramannapeta) లో 2K రన్ నిర్వహించింది. అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ స్వయంగా పాల్గొని పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, యువతలో ఉత్సాహాన్ని నింపారు.

పరుగు తీస్తూ ఆరోగ్యంపై సందేశం!

కేవలం అమరవీరులకు నివాళులర్పించడమే కాకుండా.. ఆరోగ్యకరమైన జీవనశైలి ఆవశ్యకతను ప్రజలకు చాటిచెప్పేలా 2K రన్ సాగింది. పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు కళాశాల విద్యార్థులు, స్థానిక యువత, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అక్షాన్ష్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని తెలిపారు. ముఖ్యంగా పోలీసు విధుల్లో శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

అమరవీరుల స్ఫూర్తి.. ప్రజలకు చేరువగా పోలీసు శాఖ

విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను స్మరించుకోవడంతో పాటు, పోలీసు శాఖకు ప్రజలకు మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ప్రజా భద్రతతో పాటు సామాజిక బాధ్యత, ఆరోగ్యంపై అవగాహన కల్పించడంలోనూ పోలీసు శాఖ ముందుంటుందనే సందేశాన్ని ఈ 2K రన్ చాటిచెప్పింది. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి, రామన్నపేట సీఐ ఎం. రవి, ఎస్‌ఐ జి. సతీష్, వలిగొండ ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి, ఆత్మకూరు (ఎం) ఎస్‌ఐ లక్ష్మీనారాయణ, మోత్కూరు ఎస్‌ఐ సతీష్, అడ్డగూడూరు ఎస్‌ఐ వెంకట్ రెడ్డి, ఏఎస్ఐ సురేందర్, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ సాగిన ఈ పరుగు.. ఆరోగ్యమే బలమనే సందేశాన్ని జిల్లా ప్రజలకు అందించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>