కేటీఆర్‌పై ఆ వ్యాఖ్యలు చేయొద్దు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు కోర్టు ఆదేశాలు

కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన రూ. 10 కోట్ల పరువు నష్టం దావా (KTR Defamation Case) పిటిషన్‌పై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కీలకమైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌లు భవిష్యత్తులో కేటీఆర్‌పై ఎలాంటి ఆధారాలు లేని, పరువు నష్టం కలిగించే అసత్య ఆరోపణలు చేయకూడదని న్యాయస్థానం ఆదేశించింది. డ్రగ్స్ వినియోగంతో పాటు వ్యక్తిగత జీవితం, సినీ ప్రముఖులు, మహిళలకు ముడిపెడుతూ తనపై తప్పుడు ప్రచారం చేశారని, దీనివల్ల సమాజంలో తన ప్రతిష్ఠకు తీవ్ర భంగం వాటిల్లిందని కేటీఆర్ తరుఫు సీనియర్ అడ్వకేట్ పి.విశ్వజనని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా విచారించిన సివిల్ కోర్టు తాజా నిర్ణయం తీసుకుంది.

ఈ కేసు(KTR Defamation Case)కు సంబంధించి ఇప్పటివరకు వివిధ డిజిటల్, ప్రసార మాధ్యమాల్లో పబ్లిష్ అయిన వివాదాస్పద వీడియోలు, ఆర్టికల్స్‌ను వెంటనే తొలగించాలని పలు మీడియా సంస్థలకు, సోషల్ మీడియా, యూట్యూబ్ వేదికలకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా భవిష్యత్తులోనూ కేటీఆర్ వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఎలాంటి కంటెంట్‌ను ప్రచురించవద్దని స్పష్టం చేసింది.

దీంతో న్యాయస్థానం వెలువరించిన తాజా మధ్యంతర ఉత్తర్వులపై బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయాల్లో సిద్ధాంతపరమైన విభేదాలు, విమర్శలు సహజమే అయినప్పటికీ, ఆధారాలు లేకుండా నాయకుల వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని సాగించే దిగజారుడు ప్రచారాలకు కోర్టు తీర్పు సరైన చెంపపెట్టు అని గులాబీ శ్రేణులు అంటున్నాయి.

Also Read : కేటీఆర్‌పై ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా: కొండా సురేఖ!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>