కలం, వరంగల్ బ్యూరో : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొండా సురేఖ (Konda Surekha) బహిరంగంగా వివరణ ఇచ్చారు. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలోనే ఆ మాటలన్నానని, అంతేకానీ ఉద్దేశపూర్వకంగా కాదని స్పష్టం చేశారు.
ఆనాడు తాను చేసిన నిరాధారమైన వ్యాఖ్యలు చేసి ఉండకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. కేటీఆర్‌ను గానీ, ఆయన కుటుంబ సభ్యులను గానీ బాధపెట్టాలనే దురుద్దేశం తమకు ఎంతమాత్రం లేదని చెప్పారు. తన వ్యాఖ్యలు వారిని నొప్పించి ఉంటే చింతిస్తున్నట్లు పేర్కొంటూ ఆ వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు కొండా సురేఖ వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు.

