కేకేఆర్‌లో హార్దిక్‌ కెప్టెన్‌ అవ్వొచ్చు: అశ్విన్‌

కలం, స్పోర్ట్స్: ఐపీఎల్‌ ట్రేడ్‌ విండోలో హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) పేరు హాట్‌టాపిక్‌గా మారింది. ముంబై ఇండియన్స్‌ను వీడితే.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని మాజీ భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ravichandran Ashwin) అంచనా వేశాడు. హార్దిక్‌కు కేకేఆర్‌ సరైన జట్టు కావచ్చని అభిప్రాయపడ్డాడు. హార్దిక్‌ను తీసుకోవడానికి కేకేఆర్‌ హర్షిత్‌ రాణా లేదా రింకూ సింగ్‌ను ట్రేడ్‌లో భాగంగా ఇవ్వవచ్చని అశ్విన్‌ సూచించాడు. అయితే, హార్దిక్‌ ట్రేడ్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. గుజరాత్‌ టైటాన్స్‌ కూడా ఈ ట్రేడ్‌ వ్యవహారంలోకి రావచ్చని అశ్విన్‌ పేర్కొన్నాడు.

హార్దిక్‌ కోసం ముంబైకి రషీద్‌ ఖాన్‌ను ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేశాడు. ముంబైకి భారత వికెట్‌కీపర్‌తో పాటు బౌలింగ్‌ విభాగాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌, పంజాబ్‌ కింగ్స్‌.. ఈ ఐదు జట్లు హార్దిక్‌ కోసం పోటీలో ఉండవచ్చని అశ్విన్‌ తెలిపాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఈ రేసులో లేదని పేర్కొన్నాడు. తదుపరి జట్టులో కెప్టెన్సీ తప్పనిసరి కాదని, తనకు సరిపోయే జట్టును ఎంచుకోవడమే హార్దిక్‌కు ముఖ్యమని అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>