ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యవర్గంలో వైరా మహిళకు చోటు

కలం, వైరా : తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ (Arya Vysya Mahasabha) మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా ఖమ్మం జిల్లా వైరా (Wyra) పట్టణానికి చెందిన రంగా వాసవి నియమితులయ్యారు. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రాయపూడి భవాని ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా రంగా వాసవి మాట్లాడుతూ, తనపై విశ్వాసంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షురాలు రాయపూడి భవానికి, వైరా ఆర్యవైశ్య సంఘ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. అందరి సూచనలు, సలహాలను పాటిస్తూ మహాసభ ద్వారా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. రంగా వాసవి నియామకంపై ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు వనమా విశ్వేశ్వరరావు, రాజకీయ వైస్ చైర్మన్ నూకల శ్రీనివాసరావు సహా పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>