Mobile Popup Ad
Mobile Popup Ad

హైదరాబాద్ లో దంచికొడుతున్న భారీ వర్షం

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి నైరుతి వాన (Hyderabad Rain)  దంచికొడుతోంది. సాయంత్రం వరకు సాధారణంగా ఉన్న వాతావరణం రాత్రికి ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో భారీ వర్షం పడుతోంది. గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, కొత్తగూడ చౌరస్తా, బోరబండ, అమీర్ పేట, పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఐడిపిఎల్, చింతల్, కుత్బుల్లాపూర్, సుచిత్ర కొంపల్లి తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం పడుతోంది.

వర్షం ధాటితో పలు ఏరియాల్లోని రోడ్లపై భారీగా నీరు నిలుస్తోంది. దీంతో రోడ్లపై ఉన్న వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు మార్గాల్లో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లపై ట్రాఫిక్ నెమ్మదించడంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>