కలం, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ (Mahabubnagar) పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం (MLA Camp Office) లో గణేష్ ఉత్సవాల్లో భాగంగా ప్రతిష్టించిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి గురువారం నగరంలోని పలు డివిజన్ల మహిళా కార్పొరేటర్లు (Women Corporators) సువర్ణ కిషన్ నాయక్, దేవ్లీ మేఘ్యా నాయక్, వెన్నెల రఘు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వినాయకుడి ఆశీస్సులతో మహబూబ్‌నగర్ నగర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజలంతా సోదరభావంతో పండుగలను, పర్వదినాలను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది, నాయకులు తులసీరాం నాయక్, మేఘ్యా నాయక్, రఘు తదితరులు పాల్గొన్నారు.

