కలం, వెబ్ డెస్క్: హోలీ (Holi) పండుగ అటే చిన్నాపెద్దా అంతా కలిసి ఎంతో సంబురంగా జరుపుకొంటారు. రంగులు పూసుకుంటూ, రంగు నీళ్లు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అలాంటి సంతోషకరమైన పండుగలో ఓ మహిళ దారుణానికి పాల్పడింది. కేవలం తనపై రంగులు రంగులు చల్లాడన్న కోపంతో ఐదేళ్ల బాలుడిపై వేడి నీళ్లు (hot Water) పోసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ (Nagpur) చోటుచేసుకుంది. నీళ్లు బాగా వేడిగా ఉండటంతో బాలుడికి తీవ్ర గాయాలై ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మహారాష్ట్రలోని నాగపూర్ సమీపంలోని కోరాడి ప్రాంతంలో బుధవారం ప్రజలంతా హోలీ వేడుకలు చేసుకున్నారు. ఒం వాంగే అనే ఐదేళ్ల బాలుడు ఆడుకుంటూ తన బంధువు సింధు థాక్రే అనే మహిళపై రంగు నీళ్లు చల్లాడు. దీంతో కోపం వచ్చిన ఆమె చేతిలో ఉన్న వేడి నీళ్ల నీళ్ల బకెట్‌ను బాలుడిపై కుమ్మరించింది. ఈ ఘటనలో బాలుడి శరీరం తీవ్రంగా కాలిపోయింది. స్థానికులు, కుటుంబసభ్యులు వెంటనే బాలుడిని నాగపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కోరాడి పోలీస్ స్టేషన్‌లో సింధు థాక్రేపై కేసు నమోదైంది. ఆమె వయస్సు దృష్ట్యా ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదని పోలీసులు వెల్లడించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలుడి పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిన మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

