Mobile Popup Ad
Mobile Popup Ad

మైలార్ దేవ్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని మైలార్ దేవ్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. కాటేదాన్ లో ఉన్న సుమిత్ టింబర్ డిపో, బి.డి.ప్లైవుడ్ గోదాములో పెద్ద ఎత్తున మంటలు, పొగ వ్యాపిస్తున్నాయి. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు షాపుల ఓనర్లు చెబుతున్నారు. టింబర్ టిబోలో ఉన్న చెక్కలు, కట్టెలకు మంటలు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు (Fire Accident) స్పీడ్ గా వ్యాపిస్తున్నాయి. భారీగా అగ్ని జ్వాలలు ఎగసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పెద్ద ఎత్తున పొగ వ్యాపించడంతో మంటలను ఆర్పడం ఆలస్యం అవుతోంది. ప్లైవుడ్ ఎక్కువగా ఉండటంతో మంటలు మరింత వేగంగా అంటుకుంటున్నాయి. అదుపు చేయడానికి మరింత సమయం పడుతుందని ఫైర్ సిబ్బంది చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>