Mobile Popup Ad
Mobile Popup Ad

కోదాడలో దారుణం.. పట్టపగలే భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త!

కలం, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ (Kodad) పట్టణంలో బుధవారం పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి (Stabbed) కిరాతకంగా హత్య చేశాడు. స్థానిక బస్టాండ్ ఎదుట జరిగిన ఈ ఘటనతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన మణిదీప్, శిరీష దంపతుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం కోదాడ బస్టాండ్ సమీపంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోపంతో ఊగిపోయిన మణిదీప్, తన వెంట తెచ్చుకున్న కత్తితో భార్య శిరీషపై విచక్షణారహితంగా దాడి చేశాడు. జనసంచారం ఎక్కువగా ఉండే బస్టాండ్ ప్రాంతంలో ఈ దాడి జరగడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. తీవ్ర రక్తస్రావం కావడంతో శిరీష అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

నిందితుడు మణిదీప్ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా, స్థానికులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న కోదాడ పోలీసులు (Kodad Police) వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కుటుంబ కలహాలే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.

Read Also: వియత్నాం అధ్యక్షుడితో మోదీ భేటీ.. కీలక చర్చలు

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>