కలం, మెదక్ బ్యూరో : బీసీ సబ్ ప్లాన్, 42 శాతం రిజర్వేషన్ల కల్పిస్తామనే పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) విమర్శించారు. మెదక్ (Medak) నియోజకవర్గంలోని రామాయంపేటకు చెందిన ముదిరాజ్ కులస్తులు ఆయన సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరికల కార్యక్రమంలో ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీష్ రావు (Harish Rao) మాట్లాడుతూ… కాంగ్రెస్ పాలనలో కులవృత్తులు దెబ్బతిన్నాయని, బీఆర్ఎస్ హయాంలో మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. నాలుగు వేల కొత్త సొసైటీలను ఏర్పాటు చేసి, సుమారు నాలుగు లక్షల మందికి సభ్యత్వాలు కల్పించామని చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడంతో చేప పిల్లల పంపిణీ నిలిచిపోయిందని ఆయన విమర్శించారు. అలాగే ముదిరాజ్‌లను BC-A వర్గంలో చేర్చుతామని హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు.
Read Also: విపక్షాల ఏడుపే నాకు ఆశీర్వాదం: సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Instagram

