మొన్న పాక్ బాక్సర్.. ఇప్పుడు ఉగాండా అథ్లెట్లు.. గ్లాస్గోలో వరుస మిస్సింగ్‌లు

కలం, స్పోర్ట్స్ : గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ ముగిసిన వెంటనే కలకలం రేగింది. స్వదేశాలకు వెళ్లాల్సిన పలువురు అథ్లెట్లు (Commonwealth Athletes) కనిపించకుండా పోయారు. పాకిస్థాన్, ఉగాండా క్రీడాకారుల మిస్సింగ్‌పై స్కాట్లాండ్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పలువురు అథ్లెట్లు ఆచూకీ లేకుండా ఉన్నట్లు ఫిర్యాదులు అందాయని పోలీసులు తెలిపారు. పరిస్థితులను అంచనా వేస్తున్నామని, హోం ఆఫీస్‌తో సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

మొదట పాకిస్థాన్ బాక్సర్ కుద్రతుల్లా మిస్సింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. జట్టు స్వదేశానికి బయలుదేరే ముందు ఆయన కనిపించకుండా పోయారు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో కుద్రతుల్లా హోటల్ గదిలో చివరిసారిగా కనిపించినట్లు సమాచారం. తనిఖీలు చేసినా ఆయన ఆచూకీ లభించలేదు. ఆయన పాస్‌పోర్ట్, తిరుగు ప్రయాణ టికెట్ మాత్రం జట్టు మేనేజర్ వద్దే ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఉగాండా అథ్లెట్ల మిస్సింగ్ వ్యవహారం బయటపడింది.

ఆ దేశానికి చెందిన నలుగురు బాక్సర్లు కనిపించడం లేదని సమాచారం. స్వదేశానికి వెళ్లాల్సిన సమయంలో వారు తిరిగి రాలేదు. వారిలో ఒకరు ఆశ్రయం కోరే ఆలోచనలో ఉన్నట్లు చెప్పినట్లు సమాచారం. కామన్వెల్త్ గేమ్స్ తర్వాత అథ్లెట్లు కనిపించకుండా పోవడం గతంలోనూ జరిగింది. 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్ తర్వాత కూడా పలువురు అథ్లెట్లు, అధికారులు ఆచూకీ లేకుండా పోయిన ఘటనలు నమోదయ్యాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>