Mobile Popup Ad
Mobile Popup Ad

అంబులెన్స్ కడిగితేనే ట్రీట్‌మెంట్.. ఓ ఆస్ప‌త్రి సిబ్బంది తీరు!

క‌లం, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని కట్ని జిల్లాలో హేయమైన సంఘటన చోటుచేసుకుంది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తన భర్తను కాపాడుకోవాలని ఒక నిస్సహాయురాలైన మహిళ ఆసుపత్రికి పరుగెత్తుకుంటూ వచ్చింది. అక్కడ ఉన్న సిబ్బంది ఆమె ఆవేదనను అర్థం చేసుకోవాల్సింది పోయి రాక్షసంగా వ్యవహరించారు.

మీ భర్తకు వైద్యం అందించాలంటే ముందుగా ఆసుపత్రి అంబులెన్స్‌ను శుభ్రం చేయాలని వారు షరతు పెట్టారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భర్తను చూసి తల్లడిల్లిపోయిన ఆ ఇల్లాలు మరో దారి లేక వారు చెప్పినట్లుగా అంబులెన్స్‌ను కడిగింది. ఈ దారుణానికి సంబంధించిన వార్త బయటకు రావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>