Mobile Popup Ad
Mobile Popup Ad

అసెంబ్లీని పార్ల‌మెంట్ త‌ర‌హాలో తీర్చిదిద్దాలి: సీఎం రేవంత్ రెడ్డి

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ప్రాంగణాన్ని పార్లమెంట్ తరహాలో తీర్చిదిద్దాలని, సభ గౌరవం, సభ్యుల ప్రైవసీకి ప్రాధాన్య‌త ఇస్తూ చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. నేడు అసెంబ్లీ అభివృద్ధిపై నిర్వహించిన రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. హెరిటేజ్ భవనాలకు ఎలాంటి నష్టం కలగకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. సభ్యుల కోసం పబ్లిక్ గార్డెన్‌లో ప్రత్యేకంగా ఒక క్లబ్‌ను ఏర్పాటు చేయాలని, అందులో వాకింగ్ ట్రాక్, క్రీడలకు అవసరమైన సౌకర్యాలు ఉండాలని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి సెంట్రల్ హాల్ పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో భద్రతను మరింత పటిష్టం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>