క‌ళ్లు చెదిరే సౌక‌ర్యాల‌తో కేజ్రీవాల్ మాజీ నివాసం!

క‌లం, వెబ్‌డెస్క్‌: ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ (Arvind Kejriwal) మాజీ అధికారిక నివాస భ‌వ‌నం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ‘షీష్ మహల్’ గా పేరున్న ఈ భ‌వనాన్ని ప్ర‌స్తుతం మీడియా సంద‌ర్శ‌న కోసం తెరిచారు. త్వ‌ర‌లో రూ.20 టికెట్‌తో సామాన్య‌ ప్ర‌జ‌లు కూడా సంద‌ర్శించేందుకు ఢిల్లీ స‌ర్కార్ అనుమ‌తించ‌నుంది. కేజ్రీవాల్ సీఎంగా ఉన్న‌ప్పుడు నివాసం ఉన్న ఈ భ‌వ‌నాన్ని రూ.58.83 కోట్లతో తీర్చిదిద్దార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ భవనంలో ఉన్న‌ విలాసవంతమైన సౌకర్యాలు, ఫర్నీచర్ ధరలు ప్రస్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. కేజ్రీవాల్ కుమారుడి బెడ్‌రూమ్‌లోని వస్తువుల విలువ రూ.1.12 కోట్లు అని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. అలాగే అత‌డి కుమార్తె బెడ్‌రూమ్‌లోని వస్తువుల విలువ రూ.83 లక్షలుగా పేర్కొంటున్నారు. రెండు మాస్టర్ బెడ్‌రూమ్‌లు, గెస్ట్ బెడ్‌రూమ్‌లలోని డెక‌రేష‌న్‌, ఫర్నీచర్ విలువ కూడా ఒక్కో గదికి రూ.80 లక్షలకు పైగానే ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే డ్రాయింగ్ రూమ్ కోసం రూ.73 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఇక జిమ్ పరికరాల విలువ రూ.22 లక్షలు కాగా, మసాజ్ బెడ్ ధర రూ.4 లక్షలుగా పేర్కొన్నారు. రెండు కిచెన్లలో ఒక్కోదాని విలువ రూ.50 లక్షలు కాగా, డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ ధర రూ.4.5 లక్షలు. అలాగే రూ.11.56 లక్షల ఖరీదైన షాండ్లియర్, ఒక్కొక్కటి రూ.4 లక్షల విలువైన బెడ్లు, రూ.5.47 లక్షల రెండు సీట్ల సోఫా, రూ.30 లక్షల విలువైన టీవీ యూనిట్లు ఉన్నట్లు ప్రచారం అవుతోంది. సామాన్య జీవితం గురించి మాట్లాడే కేజ్రీవాల్‌ ఇంతటి ఖరీదైన వస్తువుల‌తో అధికారిక భ‌వ‌నంలో ఉన్నారా? అని ప్ర‌జ‌లు షాక‌వుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>