కలం, వెబ్ డెస్క్ : ముంబై (Mumbai)లో మంగళవారం సాయంత్రం ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఒక మహిళ మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్‌ను నిలదీసింది. బీజేపీ నిర్వహించిన ‘మహిళా సంకల్ప ర్యాలీ’ (BJP Rally) కారణంగా ముంబైలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సరిగ్గా అదే సమయంలో తన బిడ్డను పికప్ చేసుకోవడానికి బయలుదేరిన ఒక మహిళ గంటల తరబడి వాహనాల మధ్య చిక్కుకుపోయింది.
ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె, ఏకంగా ర్యాలీలో పాల్గొంటున్న మంత్రి గిరీష్ మహాజన్ (Minister Girish Mahajan) వద్దకు వెళ్లి తన అసహనాన్ని వ్యక్తం చేసింది. ‘మీ నిరసనలేవో గ్రౌండ్‌లో చేసుకోవచ్చు కదా? రోడ్ల మీదకు వచ్చి సామాన్య ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతారు?’ అంటూ ప్రశ్నించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill) అంశంపై చేపట్టిన ఈ నిరసన ప్రదర్శనలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సదరు మహిళ ధైర్యాన్ని మెచ్చుకుంటూ ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టాయి.
Read Also: ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ టెన్షన్.. టెన్షన్..
Follow Us On: WhatsApp

