మళ్లీ రేసులోకి త్రిష.. పొలిటికల్ ఎంట్రీపై జోరుగా చర్చ

కలం, వెబ్ డెస్క్: సీఎం విజయ్ రాజకీయ ప్రయాణంలో త్రిష (Trisha) కీలక పాత్ర పోషించబోతున్నారనే ప్రచారం చాలా కాలంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలు మరోసారి రూమర్స్‌కు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి విజయ్ (CM Vijay) రాజీనామా చేయడంతో, అదే స్థానం నుంచి త్రిష బరిలోకి దిగుతారనే చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ (Raghava Lawrence) కూడా రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించడంతో అందరి దృష్టి ఆయన వైపు మళ్లింది.

కానీ, తాజాగా లారెన్స్ తన రాజకీయ ప్రవేశంపై పూర్తి స్పష్టతనిస్తూ ఆ ప్రచారానికి తెరదించాడు. తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశాడు. దీంతో ఇప్పుడు మళ్లీ అందరి కళ్ళు త్రిషపైనే (Trisha) పడ్డాయి. ఆమె తిరుచ్చి ఉపఎన్నిక బరిలో నిలవడం దాదాపు ఖాయమనే గుసగుసలు కోలీవుడ్ వర్గాల్లో మళ్లీ జోరందుకున్నాయి.

Read Also: ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల వెనుక నిజం ఇదే

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>