Mobile Popup Ad
Mobile Popup Ad

ఓయూలో ఉద్రిక్త‌త : పెట్రోల్ పోసుకొని విద్యార్థి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం!

క‌లం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University)లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. క్యాంపస్‌లోని మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో చదువుతున్న ఒక విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సదరు విద్యార్థి తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

స్పందించిన తోటి విద్యార్థులు, సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని హుటాహుటిన చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఉస్మానియా క్యాంపస్‌కు చేరుకుని విచారణ ప్రారంభించారు. ఆ విద్యార్థి అంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు ఏమిటనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>