ప్రేమించి పెళ్లి చేసుకుంటే చితకబాదుతోంది.. భర్తని హింసిస్తున్న భార్య!

కలం, వెబ్ డెస్క్: మారుతున్న సామాజిక పరిస్థితులు, వ్యక్తిగత స్వేచ్ఛ కారణంగా కొందరు భార్యలు భర్తలపై విరుచుకుపడుతున్న ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. చిన్న చిన్న గొడవలకే ఒకరిపై ఒకరు చేయి చేసుకుంటున్నారు. మాటలకే పరిమితం కాకుండా దాడులు సైతం చేస్తున్నారు. గృహహింస చట్టాల అండతో కొందరు మహిళలు వేధింపులకు గురిచేస్తుంటే, మరికొందరు మానసిక ఒత్తిడితో భర్తలను చితకబాదుతున్నారు. ఈ నేపథ్యంలో యూపీ (Uttar Pradesh)లో ఓ విచిత్ర ఘటన జరిగింది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న మొగుడ్ని ఓ భార్య చితకబాదడం చర్చనీయాంశమవుతోంది. యూపీలోని (Uttar Pradesh) గోండాకు చెందిన లోకో పైలట్ బ్రజేష్ మౌర్యాకు 2022లో ఫేస్‌బుక్‌లో అనిత అనే మహిళ పరిచయమైంది. పరిచయం ప్రేమగా మారడంతో 2025 వాలెంటైన్స్ డే రోజున పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పటి అనిత భర్తతోపాటు అత్తను కొట్టడం మొదలుపెట్టింది. తరుచుగా భార్య చితకబాదుతుండటంతో.. భార్య కొట్టే వీడియోలను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతున్నాయి.

Read Also: ఎప్​స్టీన్​ ఫైల్స్​ సంచలనం.. మైనర్​పై ట్రంప్​ అకృత్యాలు!

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>