కర్ణాటకలో రోహిత్​ వేముల చట్టం : సీఎం సిద్ధరామయ్య

కలం, వెబ్​ డెస్క్​: ఉన్నత విద్యాసంస్థల్లో కుల వివక్షను అరికట్టడానికి కర్ణాటక ప్రభుత్వం రోహిత్​ వేముల చట్టం(Rohith Vemula) అమలు చేయనుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్​ విశ్వవిద్యాలయాల్లో ఈ చట్టాన్ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

కర్ణాటకలోని హయ్యర్​ ఎడ్యుకేషన్​ ఇనిస్టిట్యూట్స్​లో కుల వివక్ష అరికట్టడానికి రోహిత్​ వేముల పేరుతో చట్టం తీసుకురావాలని సీఎం సిద్ధరామయ్యకు (Siddaramaiah) లోక్​సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్​ ఎంపీ రాహుల్​ గాంధీ గతేడాది సూచించారు. ఈ క్రమంలో గత నెల 26న రోహిత్​ వేముల చట్టం ముసాయిదా బిల్లుపై కర్ణాటక విధానసభలో చర్చ జరిగింది. అనంతరం దీనికి కేంద్ర హోంశాఖ పరిశీలనకు పంపింది. వాళ్లు సూచించిన మార్పులు, చేర్పులతో కొత్త చట్టాన్ని కేబినెట్​ ముందుకు తీసుకెళతారు. అనంతరం అసెంబ్లీ ఆమోదం తర్వాత చట్టం అమల్లోకి వస్తుంది.

కాగా, తెలంగాణకు చెందిన దళిత యువకుడు రోహిత్​ వేముల (Rohith Vemula) ఓ విశ్వవిద్యాలయంలో చదువుతూ, కుల వివక్ష కారణంగా 2016లో ఆత్మహత్య చేసుకున్నారు.

Read Also: ప్రేమించి పెళ్లి చేసుకుంటే చితకబాదుతోంది.. భర్తని హింసిస్తున్న భార్య!

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>