టీటీడీ భగవద్గీత పుస్తకాల ప్రచురణ వివాదం

కలం, వెబ్ డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో భగవద్గీత పుస్తకాల (Bhagavad Gita Books) ప్రచురణపై వివాదం చెలరేగింది. ఈ అంశంపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) సంచలన ఆరోపణలు చేశారు. మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(Bhumana Karunakar Reddy) హయాంలో కోటి భగవద్గీత పుస్తకాల ముద్రణ కోసం సుమారు రూ.50 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే ఆ పుస్తకాలలో సరైన విషయాలు ఏమీ లేవని, అవి ప్రయోజనం లేకుండా ముద్రించబడ్డాయని విమర్శించారు.

ఈ భగవద్గీత పుస్తకాల ప్రచురణలో భారీ అవకతవకలు జరిగాయని, ఈ స్కామ్‌లో భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) కుమారుడి పాత్ర కూడా ఉందని బీఆర్ నాయుడు (BR Naidu) ఆరోపించారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు వెలుగులోకి తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు. టీటీడీ నిధుల వినియోగంపై పారదర్శకత అవసరమని, ఈ అంశంపై విచారణ జరిపి నిజాలను బయటపెడతామని టీటీడీ చైర్మన్ తెలిపారు.

Read Also: ఆ వయసులోపు వారికి ఏపీలో సోషల్ మీడియా బ్యాన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>