కలం, వెబ్ డెస్క్: ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్ సెక్స్ కుంభకోణంలో మరో సంచలనం బయటపడింది(Epstein Files). ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) గతంలో ఓ మైనర్‌పై లైంగిక అకృత్యాలకు పాల్పడినట్లు అమెరికా న్యాయశాఖ గురువారం బయటపెట్టిన పత్రాల్లో వెల్లడైంది. ట్రంప్‌పై గతంలో ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేయగా, వాటిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేసింది. ఆమె వాదనలను రికార్డు చేసింది. ఆ విషయాలు ప్రస్తుతం ప్రస్తుతం అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన పత్రాల్లో ఉన్నాయి.
ఎఫ్‌బీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఆ మహిళ ఏం చెప్పిందంటే.. తాను 13–15 ఏళ్ల వయసులో ఉండగా ఎప్స్టీన్, ట్రంప్ ఇద్దరూ తనపై లైంగిక దాడి చేశారని వెల్లడించింది. ఎప్స్టీన్ తనను న్యూయార్క్ లేదా న్యూజెర్సీకి తీసుకెళ్లి ట్రంప్‌కు పరిచయం చేశాడని చెప్పింది. అప్పుడు ట్రంప్ తనను అసహజ మౌఖిక లైంగిక చర్య చేయాలని ఒత్తిడి చేశాడని పేర్కొంది. అయితే, తాను ఆయన్ని కొరికినట్లు ఎఫ్‌బీఐకి వివరించింది. ఆ తర్వాత ఈ విషయంపై గురించి మాట్లాడొద్దని తనకు, తనవాళ్లకు ఎన్నో ఏళ్లుగా బెదిరింపులు వచ్చాయని తెలిపింది. అవి ఎప్స్టీన్ చేసినవేనని అనుమానిస్తున్నట్లు పేర్కొంది.
డెమోక్రాట్ల విచారణ..
ఎఫ్‌బీఐకి ఆ మహిళ ఇచ్చిన ఇంటర్వ్యూల వివరాలు గతంలో కాంగ్రెస్ విడుదల చేసిన ఫైల్స్‌లో లేవు. అయితే, తాజాగా విడుదల చేసిన ఫైల్స్‌లో వీటిని చేర్చారు. దీంతో ట్రంప్ లైంగిక అకృత్యాలను వెల్లడించడంలో న్యాయశాఖ తీరుపై ప్రతిపక్ష డెమోక్రాట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు . ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్ వివరాలను ట్రంప్‌కు (Epstein Files – Trump) నష్టం కలిగించకుండా దాచిపెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు కేసు పత్రాల నిర్వహణపై వివరణ ఇవ్వాలని కోరుతూ అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండీకి సమన్లు జారీ చేయాలని ప్రతినిధుల సభ కమిటీ ఓటింగ్ ద్వారా నిర్ణయించింది.
Read Also: గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కేంద్రం కీలక నిర్ణయం
Follow Us On: Facebook

