Mobile Popup Ad
Mobile Popup Ad

మళ్లీ ట్రెండింగ్‌లో త్రిష.. ఎంగేజ్మెంట్ ఫొటో వైరల్

కలం, వెబ్ డెస్క్: హీరోయిన్ త్రిష (Trisha Krishnan), హీరో విజయ్ ఇటీవల చెన్నైలో జరిగిన ఒక వివాహ రిసెప్షన్‌లో జంటగా కనిపించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. వివాహ వేడుకకు వీరిద్దరూ ఒకే రకమైన రంగు దుస్తుల్లో రావడం విశేషం. విజయ్ తన భార్య నుంచి విడాకుల ప్రక్రియలో ఉన్నారనే వార్తల నేపథ్యంలో త్రిషతో కలిసి పబ్లిక్‌గా కనిపించడం చర్చనీయాంశమవుతోంది. వీరి బంధంపై నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

మరోవైపు, త్రిష (Trisha) గతంలో పారిశ్రామికవేత్త వరుణ్ మానియన్‌తో చేసుకున్న నిశ్చితార్థం (Engagement) రద్దు కావడంపై కూడా చర్చ మొదలైంది. 2015లో జరిగిన ఆ నిశ్చితార్థం ఎందుకు విఫలమైందనే విషయంపై అప్పట్లో త్రిష స్పందించారు. పెళ్లయ్యాక నటనను మానేయాలని కోరడం వల్లే తాను ఆ బంధం నుంచి తప్పుకున్నట్లు పేర్కొంది. కెరీర్‌కే తాను మొదటి ప్రాధాన్యం ఇస్తానని చెప్పింది. కేవలం గర్భం దాల్చిన సమయంలో తప్ప, మరే సందర్భంలోనూ సినిమా రంగానికి దూరంకానని ఆమె అప్పట్లో స్పష్టం చేసింది.

Read Also: విజ‌య్‌కి మ‌రో షాక్ ఇచ్చిన భార్య‌!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>