టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వర్షం పడి ఆగిపోతే పరిస్థితి ఏమిటి?

కలం, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్‌కప్ 2026 ఫైనల్ మ్యాచ్‌(T20 World Cup Final)కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ముస్తాబవుతోంది. కప్పు కొట్టాలని ఆతిథ్య జట్టు భారత్, ప్రత్యర్థి న్యూజిలాండ్ కసిగా ఉన్నాయి. ఈ రెండు జట్లు మంచి ఫామ్‌లో కొనసాగుతున్నాయి. దీంతో ఫైనల్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠతతో సాగుతుందని అభిమానులు అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతిపెద్ద ప్రశ్న ఒకటి అభిమానులను సతమతం చేస్తోంది. ఒకవేళ వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దయితే? లేదా ఈ మ్యాచ్ డ్రాగా నిలిస్తే? విజేతగా ఏ జట్టు ఉటుంది? అన్న ప్రశ్న చాలా మందిని కలవరపెడుతోంది.

వరల్డ్‌కప్ రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించిన సూర్యకుమార్ యాదవ్ సేన, వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరిన మూడో జట్టుగా రికార్డు సృష్టించింది. గతంలో పాకిస్థాన్, శ్రీలంక మాత్రమే ఈ ఘనత సాధించాయి. ప్రపంచకప్ చరిత్రలో న్యూజిలాండ్‌పై భారత్‌కు ఇప్పటివరకు విజయం లేకపోవడం ఈ మ్యాచ్‌ను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది.

వర్షం పడితే

ఈ మెగా ఫైనల్‌కు వర్షం ముప్పు పొంచి ఉంటే ఐసీసీ ప్రత్యేక నిబంధనలు అమలు చేస్తుంది. మొదట నిర్ణీత రోజునే మ్యాచ్ కుదించి అయినా పూర్తి చేసేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తారు. అది సాధ్యం కాకపోతే మ్యాచ్‌ను రిజర్వ్ డేకు మారుస్తారు. ఆట ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే మరుసటి రోజు కొనసాగిస్తారు. రిజర్వ్ డే రోజు కూడా ఫలితం తేలకపోతే భారత్, న్యూజిలాండ్ జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.

సూపర్ ఓవర్ ఉత్కంఠ

ఒకవేళ ఫైనల్ మ్యాచ్ (T20 World Cup Final)టై అయితే విజేతను నిర్ణయించడానికి సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. 2019 వన్డే ప్రపంచకప్ వివాదం తర్వాత ఐసీసీ నిబంధనలు మార్చింది. పాత పద్ధతిలో బౌండరీల సంఖ్యను పరిగణనలోకి తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఒక సూపర్ ఓవర్ టై అయితే ఫలితం వచ్చే వరకు వరుసగా సూపర్ ఓవర్లు ఆడిస్తారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న టీమిండియా ఈ నిబంధనల నడుమ మరోసారి కప్పు గెలవాలని పట్టుదలతో ఉంది.

Read Also: తల్లిని మోసం చేసి ఆస్తి రాయించుకున్న కన్న కూతురు

Follow Us On: Sharechat

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>