విజ‌య్‌కి మ‌రో షాక్ ఇచ్చిన భార్య‌!

క‌లం, వెబ్ డెస్క్‌: త‌మిళ న‌టుడు, టీవీకే అధినేత విజ‌య్‌ (TVK chief Vijay)కి వ‌రుస ఎదురు దెబ్బలు త‌గులుతున్నాయి. ఇటీవ‌ల విజ‌య్ భార్య సంగీత (Sangeetha) విడాకులు కోరుతూ కోర్టును ఆశ్ర‌యించిన విషయం తెలిసిందే. విజ‌య్‌కి ఓ న‌టితో సంబంధం ఉంద‌ని, త‌న‌ను కొన్నేళ్లుగా దూరం పెడుతున్నాడ‌ని సంగీత పిటిష‌న్‌లో పేర్కొంది. ఈ అంశం త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా ఉన్న త‌రుణంలోనే విజ‌య్‌కి సంగీత మ‌రో షాకిచ్చింది. కోర్టులో మ‌రో పిటిష‌న్ వేసింది. విడాకుల కేసు ముగిసే వ‌ర‌కు విజ‌య్ ఇంట్లో ఉండేందుకు అనుమ‌తివ్వాల‌ని కోరింది. త‌న‌ను విజ‌య్ ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఇంట్లోకి రానివ్వ‌డం లేద‌ని పిటిష‌న్‌లో పేర్కొంది. తాను భ‌ర‌ణం న్యాయ‌బ‌ద్ధంగానే అడిగాన‌ని సంగీత అంటోంది. రాజ‌కీయ పార్టీ పెట్టి సీఎం అవుదామ‌నుకుంటున్న విజ‌య్‌కి ఎన్నిక‌ల ముందు భార్య‌తో ఎదుర‌వుతున్న ఇబ్బందులు త‌మిళ‌నాట హాట్ టాపిక్‌గా మారాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>