విద్యార్థులకు చెప్పుల దండ వేసిన టీచర్

కలం, వెబ్ డెస్క్ : కృష్ణా జిల్లా(Krishna District) ఉయ్యూరులోని ఒక ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులను అవమానించిన ఘటన వెలుగులోకి వచ్చింది. షూ వేసుకుని రాలేదని ఒక టీచర్ ఇద్దరు విద్యార్థుల మెడలో చెప్పుల దండ వేసి తోటి విద్యార్థుల ముందు అవమానించింది. ఉయ్యూరు (Uyyuru) లోని విజయ సాయి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో (Vijaya Sai English Medium School) ఈ ఘటన జరిగింది. పాఠశాలకు షూ లేకుండా వచ్చిన ఇద్దరు విద్యార్థులను తరగతి గదిలోనే నిలబెట్టి, మెడలో చెప్పుల దండ వేసి శిక్షించినట్లు సమాచారం. దీంతో విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాల యాజమాన్యం,  సంబంధిత టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన విద్యాశాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Read Also: విజ‌య‌వాడ‌లో పోలీసుల‌పై కాల్పులకు యత్నం!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>