అపూర్వ విద్యార్థుల సమ్మేళనం

కలం, కరీంనగర్ బ్యూరో: రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామంలో ని జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో ఆదివారం 2002-2003 బ్యాచ్ పదో తరగతి విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఘనంగా జరిగింది. చిన్ననాటి స్నేహితులు ఒకే వేదికపై చేరి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తమ అనుభవాలను పంచుకుంటూ.. ఆనాటి జ్ఞాపకాలను, తీపి గుర్తులను నెమరు వేసుకున్నారు. అనారోగ్యానికి గురైన, మృతి చెందిన స్నేహితుల కుటుంబాలను స్మరించుకున్నారు. తాము చదువుకున్న పాఠశాలకు ఆర్థిక సాయంగా 2003 బ్యాచ్ పేరుతో రూపాయలు రూ.18,500 విలువైన సౌండ్ సిస్టం అందజేశారు.

సేవా కార్యక్రమాల కొనసాగింపు..

పలు సేవా కార్యాక్రమాలు కూడా నిర్వహిస్తూ.. అదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని ముక్తకంఠంగా అందరూ తీర్మానించారు. ఈ సందర్భంగా మిత్రులు అలనాడు చేసిన చిలిపి చేష్టలను గుర్తు చేసుకుంటూ ఆనందోత్సాహాల్లో మునిగిపోయి ఆటాపాటలతో సందడి చేశారు. అనంతరం అప్పటి గురువులను పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు. విద్యార్థులు అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రస్తుత పాఠశాల హెడ్మాస్టర్ దూస గోవర్ధన్, పూర్వ హెడ్మాస్టర్ డి.శ్రీనివాస్, ఉపాధ్యాయులు వెంకన్న, పావని, తిరుమల, శారద, భూపతి, కవిత శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>