సాగర్‌లో థాయిలాండ్ బౌద్ధ భిక్షుల భిక్ష యాత్ర

కలం, నాగార్జునసాగర్ : థాయిలాండ్ (Thailand) దేశానికి చెందిన బౌద్ధ భిక్షువుల (Buddhist Monks) బృందం నందికొండ మున్సిపాలిటీ నాగార్జునసాగర్‌ (Nagarjuna Sagar) లో శుక్రవారం నాడు భిక్ష యాత్రను (Alms Yatra) నిర్వహించారు. కర్ణాటక కలిబురిగి బుద్ధ విహార నుండి 403 కిలోమీటర్ల మేర దమ్మ పాదయాత్రతో పాటు ఈ నెల 1వ తేదీన సాగర్‌లోని బుద్ధవనం (Buddhavanam) చేరుకున్నారు. బుద్ధవనంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న బౌద్ధ భిక్షువులు ఈనెల ఏడవ తేదీ వరకు బుద్ధ వనంలో ఉండనున్నారు.

అంతర్జాతీయ బౌద్ధ కేంద్రమైన బుద్ధవనంలో త్వరలో బుద్ధ విహారాలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో బౌద్ధ బిక్షువులు (Buddhist Monks) శుక్రవారం సాగర్‌లోని పలు ప్రాంతాలలో భిక్ష యాత్రను (Alms Yatra) కొనసాగించారు. సుమారు 20 మంది థాయిలాండ్ బౌద్ధ భిక్షువులు ఇంటింటికి వెళ్లి భిక్షాటనను చేశారు. స్థానికులు తమకి అందుబాటులో ఉన్న బిస్కెట్లు, చాక్లెట్లు, బ్రెడ్లు, పండ్లు, ఆహార పదార్థాలను బౌద్ధ బిక్షులకు ఇచ్చారు. 403 కిలోమీటర్ల మేర బౌద్ధ భిక్షువులతో దమ్మ పాదయాత్రలో పాల్గొంటూ వచ్చిన సాతి అనే శునకం సాగర్‌లో భిక్ష యాత్రలో కూడా బౌద్ధ భిక్షువులతో పాటే పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది. వీరితోపాటు బుద్ధవనం ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, బుద్దవనం సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>