Mobile Popup Ad
Mobile Popup Ad

డబ్ల్యూడబ్ల్యూఈలో సరికొత్త సంచలనం.. ఎవరీ నిక్కీ బ్లాక్‌హార్ట్!

కలం, వెబ్ డెస్క్: డబ్ల్యూడబ్ల్యూఈ ఎన్‌ఎక్స్‌టీ (WWE NXT) లేటెస్ట్ ఎపిసోడ్‌లో నిక్కీ బ్లాక్‌హార్ట్ (Nikki Blackheart) ఎంట్రీతో అందరి కళ్లు ఆమెపై పడ్డాయి. మెయిన్ ఈవెంట్‌లో టాటమ్ పాక్స్లీపై కెలానీ జోర్డాన్ విజయం సాధించిన వెంటనే, నిక్కీ బ్లాక్‌హార్ట్ రింగ్‌లోకి దూసుకొచ్చి పాక్స్లీపై దాడి చేసి ఆశ్చర్యపర్చింది. టెలివిజన్‌పై నిక్కీకి ఇదే మొదటి అధికారిక ప్రదర్శన. ఈ ఒక్క దెబ్బతో ఆమె తన ప్రస్థానాన్ని పవర్‌ఫుల్‌గా ప్రారంభించింది. డొమినికన్ రిపబ్లిక్‌లో జన్మించిన 29 ఏళ్ల నిక్కీ, డబ్ల్యూడబ్ల్యూఈలోకి రాకముందు ‘మార్టినెజ్’ అనే రింగ్ నేమ్‌తో సీసీడబ్ల్యూ, హుడ్‌స్లామ్ లాంటి (ఇండీ) రెజ్లింగ్ పోటీల్లో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2025లో ఆమె మ్యాచ్ క్లిప్స్ ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ ట్రైఅవుట్స్‌కు హాజరై ఈ ఏడాది మార్చిలో అధికారికంగా కాంట్రాక్ట్ దక్కించుకుంది.

నిజానికి నిక్కీ బ్లాక్‌హార్ట్ (Nikki Blackheart) మే 19న జరిగిన మ్యాచ్‌లో స్కైలర్ రేపై విజయం సాధించినప్పటికీ, అది టెలివిజన్‌లో ప్రసారం కాలేదు. దీంతో తాజా ఎపిసోడ్‌లో పాక్స్లీపై చేసిన దాడే ఆమెకు అసలైన గ్రాండ్ ఎంట్రీగా నిలిచింది. డబ్ల్యూడబ్ల్యూఈ లోకి అడుగుపెట్టడానికి ముందు ఆమె టాప్ స్టార్స్‌తో కలిసి శిక్షణ పొందింది. ఆ సమయంలో లెజెండరీ రెజ్లర్ జాన్ సీనాను అనుకోకుండా కలవడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని చెప్పంది. ఇండీ రెజ్లింగ్‌లో సంచలనాలు సృష్టించి ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఎన్‌ఎక్స్‌టీలోకి ఎంట్రీ ఇచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>