అధిక మాసంలో ఇలా చేస్తే.. 14 ఏళ్ల పాటు సిరిసంపదలు ఖాయం!

కలం, వెబ‌్‌డెస్క్: అధిక జ్యేష్ఠ మాసం (Adhika Jyeshta Masam) అనేది హిందూ చాంద్రమాన క్యాలెండర్‌లో వచ్చే అత్యంత పవిత్రమైన, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ఒక అదనపు నెల. సాధారణంగా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పంచాంగంలో వచ్చే ఈ మార్పు, మానసిక ఆత్మశుద్ధికి, దైవచింతనకు ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తారు. ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అనే పేరుతో పిలుస్తారు.

అయితే విష్ణుమూర్తిగా చాలా ప్రీతికరమైన ఈ అధిక మాసం (Adhika Masam) లో చేసే పూజలు సత్ఫలితాన్ని ఇస్తాయని పండితులు సూచిస్తున్నారు. మామూలు మాసాల్లో చేసే పూజలు, దానాలు, స్తోత్ర పారాయణాల కన్నా అధిక మాసంలో చేసే పూజలు, దానాలు, స్తోత్ర పారాయణాలు ఎక్కువ ఫలితాలను ఉంటాయట. అధిక మాసంలో చేయాల్సిన ముఖ్యమైన పనులేంటో తెలుసుకుందామా?

అధికమాసం మే 17వ తేదీ నుంచే ప్రారంభమైంది. ఈ పవిత్రమైన అదనపు నెల జూన్ 15, సోమవారం వరకు కొనసాగుతుంది. సాధారణంగా మామూలు మాసాలతో పోలిస్తే అధిక మాసంలో చేసే పూజలు సత్ఫలితాలను ఇస్తాయట. అందుకే అధిక మాసంలో ప్రతిరోజూ ఇంట్లో దీపం వెలిగించి ఈ ఒక్క నామం (ఓం పురుషోత్తమాయ నమ:) చదువుకున్నా అద్భుత ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

అధిక మాసం అంటే దానాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న మాసం. కాబట్టి ఈ మాసంలో కనుక గుమ్మడి కాయ దానం ఇస్తే 14 సంవత్సరాల పాటు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉన్న వారు ఎవరైనా సరే అధిక మాసంలో గుమ్మడికాయను బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. వారి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

ప్రతి రోజూ తులసికి నీటిని సమర్పించి “ఓం నమో భగవతే వాసుదేవాయ” అని జపించాలట. గురువారం రోజు పసుపు ధాన్యాలు, శనగపప్పు, బెల్లం లేదా పసుపును దానం చేయాలి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి చిత్రపటాల ముందు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అనవసర ఖర్చులను నివారించాలి. భక్తిశ్రద్ధలతో ఆవులకు లేదా పక్షులకు ఆహారం పెట్టాలి. కేవలం డబ్బు కోసమే కాకుండా స్థిరమైన, స్వచ్ఛమైన, ధర్మబద్ధమైన ఆదాయం కోసం ప్రార్థన చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఇన్ని సత్ఫలితాలను ఇచ్చే ఈ మాసంలో ఈ తప్పులు చేయకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు.

అధిక మాసంలో అస్సలు చేయకూడని పనులు..

సాంప్రదాయకంగా అధిక మాసంలో వివాహం, గృహ ప్రవేశం, ముండనం, నిశ్చితార్థం లేదా కొత్త భౌతిక వ్యాపారాలను ప్రారంభించడం వంటి ప్రధాన శుభకార్యాలను నివారించాలి. ఆధ్యాత్మిక కార్యకలాపాలు, దానధర్మాలు, విద్య, స్వస్థత, మంత్ర సాధన, ధ్యానం, సేవ వంటివి చేసుకోవచ్చు.

మాంసాహారం, మద్యం, పొగాకు ముట్టకూడదు. కోపం, చాడీలు, అబద్ధాలు, క్రూరత్వం, అహం వీడాలి. పెద్దలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్త్రీలు, జంతువులు, ఆధ్యాత్మిక పద్ధతుల పట్ల అగౌరవాన్ని నివారించాలి. అలాగే, కేవలం దురాశ కోసం లేదా ఇతరులకు హాని కలిగించడం కోసం ఆచారాలను ఉపయోగించొద్దు. ఈ మాసం శుద్ధీకరణకు ఉద్దేశించబడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>