ఆర్టీసీ యూనియన్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే నాగరాజు

కలం, వరంగల్: టీజీఎస్‌ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ, వరంగల్ పరిధిలోని ఆర్టీసీ డిపోల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇందులో భాగంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు (KR Nagaraju) హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనుగాల వెంకట్రాంరెడ్డితో కలిసి హనుమకొండ డిపో పరిధిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు, వారి సంక్షేమానికి సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు.

ఆర్టీసీ సంస్థ అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో కీలకమని, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో వారు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. ఆర్టీసీ కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత, మెరుగైన పని పరిస్థితుల కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. సంస్థ అభివృద్ధితో పాటు కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

ఆర్టీసీ అభివృద్ధిలో కార్మికులే కీలకమని ఎమ్మెల్యే నాగరాజు అన్నారు. కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, సంక్షేమం కోసం నిరంతరం అండగా ఉంటామని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. సంస్థ బలోపేతంతో పాటు కార్మికుల సంక్షేమానికి సమాన ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెట్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆర్టీసీ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>