కాలం చెల్లిన ఉత్పత్తులు సీజ్..

కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ (Warangal) జిల్లాలో కాలం చెల్లి పాడైపోయిన ఆహార ఉత్పత్తులు పోలీసులు సీజ్ చేశారు. జిల్లాలోని గొర్రెకుంటలోని వెల్ మార్క్ కంపెనీకి చెందిన సుమారు రూ.1,06,940 విలువ గల వివిధ రకాల స్వీట్స్, ఖారా, మురుకులు, లాలిపాప్స్, మాంగో ఫ్రూటీ, కాజా ఉత్పత్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి సీజ్ చేశారు. వరంగల్ (Warangal) నగరంలో ఫుడ్ సేఫ్టీ విషయంలో నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలు పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్న వ్యాపారస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని వరంగల్ పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ సార్ల రాజు, సిబ్బంది వెల్ మార్క్ కంపెనీ నడుపుతున్న కింగ్ స్టన్ కు చెందిన తయారీ, డిస్ట్రిబ్యూషన్ గోదాం పై ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో కలిసి దాడి చేసారు. ఈ మేరకు అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఫుడ్ సేఫ్టీ నియమాలు పాటించకుండా కాలం చెల్లి పాడైన ఉన్న దాదాపు 16 రకాల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్బంగా కంపెనీ ఓనర్ కింగ్ స్టన్ పై కేసు నమోదు చేసి ప్రాపర్టీ తో పాటు తదుపరి చర్యల నిమిత్తం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ క్రిష్ణమూర్తికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>