కలం, వరంగల్: గ్రేటర్ వరంగల్(Warangal) పరిధిలో ఆస్తిపన్ను వసూళ్లను వేగవంతం చేయాలని బల్దియా కమిషనర్ టి. వెంకన్న (Venkanna) అధికారులను ఆదేశించారు. శనివారం రెవెన్యూ, ట్యాక్సేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పన్నుల వసూళ్ల పురోగతిపై ఆయన సమీక్షించారు. సర్కిల్, వార్డు వారీగా రోజువారీ పన్ను వసూళ్లను పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. పెద్ద మొత్తంలో ఆస్తిపన్ను బకాయిలు ఉన్న డిఫాల్టర్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. దీర్ఘకాలంగా బకాయిలు చెల్లించని వారిపై ఆర్ఆర్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
నగరంలోని ప్రతి ప్లాట్‌కు వీఎల్టీ (Vacant Land Tax) వసూలు చేయాలని కమిషనర్ సూచించారు. కొత్త అసెస్మెంట్లతో పాటు కమర్షియల్ భవనాలను గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఆస్తిపన్ను వసూళ్లతో పాటు నీటి పన్ను బకాయిలను కూడా సమర్థవంతంగా వసూలు చేయాలని అధికారులకు సూచించారు. నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కమిషనర్ టి. వెంకన్న హెచ్చరించారు.
Also Read : సొంతపార్టీ నాయకులపై జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం
Follow Us On: Instagram

