99 డేస్‌ యాక్షన్‌ ప్లాన్‌.. అధికారులకు కడియం కావ్య కీలక సూచనలు

కలం, వరంగల్ బ్యూరో: ప్రభుత్వ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలుచేస్తూ జిల్లాను అభివృద్ధిపథంలో అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య (Kadiyam Kavya) అన్నారు. శనివారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధ్యక్షతన 99 రోజుల యాక్షన్ ప్లాన్ (99 Day Action Plan)లో భాగంగా జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గతంలో నిర్ణయించిన అంశాలపై తీసుకున్న చర్యలు, మహిళా శిశు సంక్షేమ, జిల్లా వైద్య ఆరోగ్య, విద్యా, వ్యవసాయ గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య, నీటిపారుదల, గనులు, భూగర్భ జలాలు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ, ఇతర విషయాలపై చర్చించారు.

ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య (Kadiyam Kavya) మాట్లాడారు. ప్రభుత్వం విద్యా వైద్యానికి ప్రాధాన్యతనిస్తోందన్నారు. పాఠశాలల్లో డ్రాపౌట్స్ పై దృష్టి సారించాలని, విద్యార్థుల ప్రవేశాల సంఖ్యను గణనీయంగా పెంచాలన్నారు. బాల్యవివాహాల నిర్మూలనకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. హన్మకొండ జిల్లా పదో తరగతి ఫలితాల్లో అగ్రస్థానంలో ఉండాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యేంతవరకు స్నాక్స్ అందజేయాలన్నారు. గర్ల్స్ హాస్టల్‌ను తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు టాయిలెట్స్ ఉండాలనేది ఎంతో ముఖ్యమని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిందని పేర్కొన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో (99 Day Action Plan) వైద్య ఆరోగ్య సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వీబీజీ- రామ్ జీ పథకం గైడ్లైన్స్ గురించి తెలియజేయాలన్నారు.

ఈ సమావేశంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కెఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ రావు, మేయర్ సుధారాణి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read Also: మహిళలకు నెలకు రూ.2500, ఉచిత గ్యాస్ సిలిండర్లు : విజయ్

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>