మహిళలకు నెలకు రూ.2500, ఉచిత గ్యాస్ సిలిండర్లు : విజయ్

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పార్టీలు కీలక హామీలను గుప్పిస్తున్నాయి. తాజాగా టీవీకే (TVK) పార్టీ అధినేత, దళపతి విజయ్ (Vijay) సంచలన హామీలు ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని ప్రకటించారు. ఆడపిల్ల పెళ్లికి 8 గ్రాముల బంగారం అందిస్తామని తెలిపారు. మహిళలకు ఆర్థిక చేయూత కింద ఏడాదికి రూ.15వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు.

అలాగే ఏడాదికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని.. మహిళలకు రేషన్ షాపుల్లో ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందజేస్తామన్నారువ విజయ్ (Vijay Thalapathy). కర్ణాటక, తెలంగాణ, ఏపీ మాదిరిగానే తమిళనాడు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితం ప్రయాణం కల్పిస్తామన్నారు. ఇప్పటికే విజయ్ కొన్ని కీలక హామీలు ఇచ్చారు. అందులో రెండెకరాల లోపు ఉన్న కుటుంబాల పిల్లలకు ఉచిత ఉన్నత విద్యను అందజేస్తామన్నారు. ఐదెకరాల లోపు రైతులకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. అవినీతి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విజయ్ కీలక హామీలు ఇచ్చారు.

Read Also: ఇరాన్ నౌక విషయంలో మాది సరైన నిర్ణయమే : భారత్

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>