Mobile Popup Ad
Mobile Popup Ad

130 మంది మావోయిస్టులు అప్పగించిన ఆయుధాలు ఇవే..

కలం, వెబ్ డెస్క్ : దేశంలోనే అతిపెద్ద మావోయిస్టుల లొంగుబాటు తాజాగా జరిగింది. 130 మంది మావోయిస్టులు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఇందులో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, 10 మంది డివిజనల్ కమిటీ మెంబర్లు, 46 మంది ఏరియా కమిటీ మెంబర్లు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. 124 తుపాకులను పోలీసులకు అప్పగించారు (Maoists Weapons) మావోయిస్టులు.

అయితే వీరు అప్పగించిన వాటిల్లో (Maoists Weapons).. INSAS LMG రైఫిల్ ఒకటి, AK-47 రైఫిళ్లు-31, INSAS రైఫిళ్లు-21, SLR రైఫిళ్లు-20, 303 రైఫిళ్లు-18, ఇతర తుపాకులు-33 ను పోలీసులకు అప్పగించారు. వీరికి సీఎం రేవంత్ రెడ్డి పునరావాస చెక్కులను అందజేశారు. శాంతి మార్గంలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని.. మిగిలిన మావోయిస్టులు కూడా త్వరగా లొంగిపోవాలన్నారు. మావోయిస్టులకు అందించే పునరావాస అంశాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో తాను చర్చించానని చెప్పారు. రాష్ట్ర పరిధిలోని అంశాలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు రేవంత్.

Read Also: ఓం బిర్లా సేవలు అమోఘం.. ప్రధాని మోడీ ప్రశంసలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>