కలం, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో వరుస అగ్నిప్రమాదాలు (Delhi Fire Accidents) చోటు చేసుకున్నాయి. బుధవారం రాత్రి ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్క్ అండర్‌పాస్ సమీపంలో ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ)కి చెందిన ఎలక్ట్రిక్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ బస్సును నిలిపివేసి అగ్నిమాపక సిబ్బందికి సమచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైరింజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.
అయితే, అప్పటికే మంటలు బస్సు మొత్తం వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదం సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది. మరోవైపు, బుధవారం సాయంతం ఢిల్లీలోని యమునా బ్యాంక్ డిపో సమీపంలో మరో అగ్నిప్రమాదం జరిగింది. ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో మూడు ఫైరింజన్లతో చేరుకున్న ఫైర్ సేఫ్టీ బృందం మంటలను అదుపు చేశారు. ఒకే రోజు నగరంలో రెండు అగ్ని ప్రమాదాలు (Delhi Fire Accidents) చోటుచేసుకోవడం ఆందోళన కలిగించింది.

