బీరం లక్ష్మారెడ్డి సేవలు చిరస్మరణీయం: మాజీ మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి

కలం, వనపర్తి: ప్రజలతో మమేకమై సేవలందించిన బీరం లక్ష్మారెడ్డి (Beeram Laxma Reddy) ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి లక్ష్మారెడ్డి దశదినకర్మ సందర్భంగా బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో కలిసి ఆయన వ్యవసాయ క్షేత్రానికి చేరుకుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. లక్ష్మారెడ్డి మృతికి సంతాపంగా పెద్ద సంఖ్యలో ప్రజలు చూపిన అభిమానం ఆయన ప్రజలతో పెనవేసుకున్న అనుబంధానికి నిదర్శనమని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ అభిమానం హర్షవర్ధన్‌రెడ్డికి ఎప్పటికీ అండగా నిలుస్తుందని అన్నారు. లక్ష్మారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబసభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>