కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ సమీపంలో శనివారం మధ్యాహ్నం ప్రమాదం చోటుచేసుకుంది. వ్యాగనార్ కారులోని (WagonR Car) ఎల్పీజీ కిట్ లీకేజీ (LPG Gas Leak) కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని నటరాజ్‌నగర్ కాలనీకి చెందిన రవి అనే మెకానిక్ తన వ్యాగనార్ కారులో సోఫీనగర్ వైపు నుంచి నిర్మల్‌కు వస్తుండగా మార్గమధ్యలో కారులోని ఎల్పీజీ కిట్ నుంచి గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
దీంతో కారులో ఉన్న రవికి మంటలు అంటుకున్నాయి. అప్రమత్తమైన రవి చాకచక్యంగా కారు నుంచి బయటకు వచ్చాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మల్లేష్ అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రవిని 108 అంబులెన్స్‌లో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే రవి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.

