Mobile Popup Ad
Mobile Popup Ad

కాళేశ్వరంపై హైకోర్టు తీర్పును తప్పుదోవపట్టిస్తున్నారు: ఎంపీ చామల

కలం, నల్లగొండ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును వక్రీకరిస్తూ బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala Kiran Kumar Reddy) మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని కోర్టు చెబితే, క్లీన్ చిట్ వచ్చినట్లు బావా-బామ్మర్దులు (కేటీఆర్, హరీష్ రావు) తీన్మార్ డాన్సులు చేస్తూ సంబురాలు చేసుకోవడం హాస్యాస్పదమని ఎంపీ విమర్శించారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలితే ఏమవుతుందని మాట్లాడుతున్నారు.. కానీ ఇదే మేడిగడ్డ కాళేశ్వరానికి గుండెకాయ అని గతంలో కేసీఆర్ చెప్పిన విషయాన్ని మర్చిపోయారా? అని ప్రశ్నించారు. మేడిగడ్డలో నీళ్లు నింపవద్దని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు.

కేసీఆర్ కుటుంబం రాటుదేలిన దోపిడీ దారులని, గూగుల్ మ్యాపులు చూసి ప్రాజెక్టులు కట్టి తెలంగాణను అప్పుల పాలు చేశారని చామల ఆరోపించారు. 1,600 మంది బలిదానాలు, నీళ్లు, నిధులు, నియామకాల కంటే కేసీఆర్ తన కుటుంబ ‘బ్రాండ్’ కే ప్రాముఖ్యత ఇచ్చారని విమర్శించారు. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ హయాంలో మొదలైన ప్రాజెక్టులను బీఆర్ఎస్ ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టులు దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉంటే, కాళేశ్వరం ఎందుకు కుంగిపోయిందో సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ దోపిడీపై బీజేపీ డ్రామాలు ఆడుతోందని, నిజంగా చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

సీబీఐ విచారణను ఆపమని కోర్టు ఎక్కడా చెప్పలేదని ఆయన (MP Chamala) స్పష్టం చేశారు. ఈ రెండు పార్టీల నాటకాలను గమనించే ప్రజలు అసెంబ్లీలో రేవంత్ రెడ్డిని సీఎం చేశారని, లోక్ సభలో బీఆర్ఎస్‌కు గుండు సున్నా ఇచ్చారని ఎద్దేవా చేశారు. “తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఎవరినీ విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ప్రభుత్వం ప్రస్తుతం న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ సంబురాల రాంబాబులను లోపల వేస్తాం” అని చామల కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. ఏడాది తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్.. జీవన్ రెడ్డిని రీఛార్జ్ చేయడానికి వచ్చారా? అంటూ చమత్కరించారు.

Read Also: ఆర్టీసీ సమ్మె వేళ.. సొంత పార్టీపై జగ్గారెడ్డి సెటైర్లు!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>