కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను (BRS MLCs) పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకునే అధికారం పోలీసులకు లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. అయినా పేక్ కేసులు పెట్టి తాతా మధు(Tata Madhu), నవీన్ రెడ్డి (Naveen Kumar Reddy)ని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఈ ఘటన ద్వారా కోర్టులు, చట్టాల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న గౌరవం అర్థం అవుతుందని కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు.
1000 రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయకుండా అరెస్టులు, అక్రమ నిర్బంధాలు సాధించిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 420 హామీలు అమలు చేస్తామంటే తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం వచ్చి స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతామన్నారు. దీనికి మేము సిద్ధం.. హామీలు అమలు చేయడానికి మీరు సిద్ధమా..? అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళల పట్ల గౌరవం ఉంటే ఎమ్మెల్యేలు సబిత ఇంద్రారెడ్డి, సునీతల చీరలు లాగి, దాడి చేసిన వారిపై ఎలాంటి తీసుకున్నారో చెప్పాలని ఆయన (KTR) ప్రశ్నించారు. ప్రజలు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ ను గమనిస్తున్నారని హెచ్చరించారు.
Also Read : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు కీలక ఆదేశాలు
Follow Us On: X(Twitter)

