Mobile Popup Ad
Mobile Popup Ad

నాంపల్లి క్రిమినల్ కోర్టులో అగ్ని ప్రమాదం!

క‌లం, వెబ్ డెస్క్‌: నాంప‌ల్లి (Nampally)లో మ‌రో అగ్ని ప్ర‌మాదం జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపింది. క్రిమిన‌ల్ కోర్టు (Criminal Court)లోని మూడో అంత‌స్తులో అర్ధ‌రాత్రి ఒంటి గంట త‌ర్వాత ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. మూడో అంత‌స్తులో మంట‌లు చెల‌రేగి వ్యాపిస్తుండటంతో సెక్యూరిటీ సిబ్బంది అప్ర‌మ‌త్త‌మై అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజిన్లు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని మంట‌లు ఆర్పివేశాయి. ప్ర‌మాదానికి గ‌ల ఖ‌చ్చిత‌మైన కార‌ణాలు తెలియ‌రాలేదు.

షార్ట్ స‌ర్క్యూట్ కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగి ఉండ‌వ‌చ్చ‌ని అధికారులు ప్రాథ‌మికంగా భావిస్తున్నారు. మంట‌లు చెల‌రేగిన మూడో అంత‌స్తులో ప‌లు ముఖ్య‌మైన ఫైల్స్‌తో పాటు సామ‌గ్రి ద‌గ్ధ‌మైంది. అయితే ఫైర్ సిబ్బంది మంట‌ల‌ను ఇత‌ర అంత‌స్తుల‌కు వ్యాపించ‌కుండా చేయ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. ఈ మూడో అంత‌స్తులో ఉన్న ఫైల్స్ ఏమిటి?ప్ర‌మాదానికి గ‌ల ఖ‌చ్చిత‌మైన కార‌ణాలు ఏమిటి? అనేది తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>