Mobile Popup Ad
Mobile Popup Ad

కేన్ విలియమ్సన్‌ రిటైర్మెంట్.. కోహ్లీ ఎమోషనల్ పోస్ట్

క‌లం, వెబ్ డెస్క్: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగానే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) సోషల్ మీడియా ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఒక ప్రత్యర్థి నుంచి ఒక మంచి స్నేహితుడిగా కేన్ మారాడని గుర్తు చేసుకున్నాడు. అంతేకాకుండా కేన్‌కు కోహ్లీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపాడు.

16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు పలికిన విలియమ్సన్‌ను ఉద్దేశించి కోహ్లీ స్పందిస్తూ, అతనితో పోటీ పడిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొన్నాడు. ఆటకు సంబంధించిన విషయాలకే కాకుండా, తమ మధ్య ఏర్పడిన స్నేహం కూడా తనకు ఎంతో విలువైనదని తెలిపాడు. ప్రతిసారి కలిసినప్పుడు లేదా మాట్లాడినప్పుడు ఆ అనుబంధాన్ని ఆస్వాదించానని పేర్కొన్నాడు. ఇకపై జీవితాన్ని ప్రశాంతంగా ఆస్వాదించాలని, భవిష్యత్‌లో మరిన్ని మంచి రోజులు రావాలని ఆకాంక్షించాడు.

కోహ్లీ, విలియమ్సన్‌లు గత దశాబ్దంలో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన “ఫ్యాబ్ ఫోర్”లో కీలక సభ్యులు. స్టీవ్ స్మిత్, జో రూట్‌తో పాటు వీరిద్దరూ అన్ని ఫార్మాట్లలో నిలకడైన ప్రదర్శనతో అభిమానుల గౌరవాన్ని సంపాదించారు. ఆసక్తికరంగా ఇద్దరూ టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయికి చేరువలోనే తమ కెరీర్‌ను ముగించారు.

35 ఏళ్ల విలియమ్సన్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 19,346 పరుగులు సాధించాడు. 2021లో న్యూజిలాండ్‌కు తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టైటిల్ అందించిన కెప్టెన్‌గా కూడా చరిత్రలో నిలిచాడు. అతని రిటైర్మెంట్‌తో ప్రపంచ క్రికెట్‌లో ఒక గొప్ప అధ్యాయానికి ముగింపు పడగా, కోహ్లీ సందేశం ఇద్దరు దిగ్గజాల మధ్య ఉన్న స్నేహాన్ని మరోసారి గుర్తు చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>