భారత నౌకలపై దాడి… ట్రంప్ సంచలన ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై తాము దాడి చేశామన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) అన్నారు. భారత నౌకలపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిందని, తాము ఆ దాడులను అడ్డుకున్నామని వెల్లడించారు. భారత్ తో ఉన్న మైత్రిని చేరిపేందుకే ఇరాన్ తప్పుడు ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. భారత నౌకలపై ఇరాన్ దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. హర్మూజ్ జలసంధిలో భారత నౌకలపై జరుగుతున్న దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

మరోవైపు శాంతి ఒప్పందంపై ఇరాన్ ఫేక్ ప్రచారం చేస్తుందని ట్రంప్ మండిపడ్డారు. రెండు దేశాల మధ్య యుద్ధ విరమణ ఒప్పందంలో ఉన్న వాస్తవ అంశాలకు .. ఇరాన్ ప్రచారం చేస్తున్న వాటికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. ఈ క్రమంలోనే ఇరాన్ తో చర్చలు జరపడమంత నీచమైన పని లేదని, ఇకపై వారితో మంచితనంతో నడుచుకోవడం జరగదని తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ సోషల్ లో ట్రంప్ తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>