ఇన్‌ఫ్లూయెన్స‌ర్ చేతికి సీఎం రేవంత్ ఐపీఎల్ టికెట్స్.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌!

క‌లం, వెబ్ డెస్క్‌: హైదరాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియం వేదిక‌గా జ‌రుగుతున్న స‌న్ రైజ‌ర్స్ హైదరాబాద్ (SRH) వ‌ర్సెస్ చెన్నై సూప‌ర్ కింగ్స్ (CSK) ఐపీల్ (IPL) మ్యాచ్ తెలంగాణ రాజ‌కీయాల్లో ఒక ఆసక్తికరమైన చ‌ర్చ‌కు తెర లేపింది. ఫేమ‌స్ ఇన్‌ఫ్లుయెన్స‌ర్‌, నటి కుషితా కల్లపు (Kushitha Kallapu) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నేడు జ‌రుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లను కుషితా తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. అయితే ఆ టికెట్లపై తెలంగాణ సీఎంకు సన్‌రైజర్స్ టీమ్ ఇచ్చిన కాంప్లిమెంటరీ టికెట్లు అని స్పష్టంగా రాసి ఉండటం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.

సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కోసం కేటాయించిన అత్యంత విలువైన ఈ కాంప్లిమెంట‌రీ టికెట్లు అసలు ఈ యంగ్ ఇన్‌ఫ్లుయెన్స‌ర్‌ చేతికి ఎలా వెళ్లాయనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా సీఎం స్థాయి వ్యక్తులకు ఇచ్చే వీఐపీ పాస్‌లు నేరుగా వారికి లేదా వారి కార్యాలయానికి అందుతాయి. కానీ కుషితా (Kushitha Kallapu) ఆ టికెట్లను పట్టుకొని ఫోటోలు దిగడంతో సీఎం టికెట్లు కుషితా దగ్గర ఏం చేస్తున్నాయి? అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి లేదా ఫ్రాంచైజీ నుంచి ఎవరైనా వీటిని ఆమెకు ఇచ్చారా? లేక దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అన్న అనుమానాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఇదే ఛాన్స్ అనుకొని బీఆర్ఎస్ సోష‌ల్ మీడియా టీం రెచ్చిపోతోంది. రూ.40,000 విలువైన సీఎం టికెట్లు ఇన్‌ఫ్లుయెన్స‌ర్ చేతికి ఎలా వెళ్లాయంటూ ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన నేప‌థ్యంలో మ‌రి కుషితా దీనిపై స్పందిస్తుందా? అనేది వేచి చూడాలి.

Read Also: ఇండియాను మోదీ అమ్మేశారు: రాహుల్ గాంధీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>