కలం, వెబ్ డెస్క్ : ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కంట్రోల్ చేస్తున్నాడని.. ఇండియాను అమ్మేశాడని లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమిళనాడులోని రాణిపేటలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. మన దేశ రైతులు, కార్మికులు, చిన్న తరహా వ్యాపారులు, డేటా భద్రత, ఇంధన భద్రతలను అమెరికా చేతుల్లో పెట్టారని విమర్శించారు. ఎప్ స్టీన్ ఫైల్స్ ద్వారా అగ్రరాజ్యం ప్రధాని మోదీని నియంత్రిస్తోందని ఆరోపించారు.
పార్లమెంట్ వేదికగా మోదీ, షా కుట్ర..
మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ.. మోదీ (PM Modi), అమిత్ షా (Amit Shah) పార్లమెంట్ వేదికగా దేశాన్ని మోసం చేయాలని చూశారని రాహుల్ (Rahul Gandhi) మండిపడ్డారు. దేశ ఎన్నికల స్వరూపాన్ని పూర్తిగా మార్చేందుకు కుట్ర పన్నారని వివరించారు. ప్రతి రాష్ట్రంలో ఎంపీ సీట్లను తమకు నచ్చినట్లుగా మార్చి.. దక్షిణాది, ఉత్తరాది, చిన్న రాష్ట్రాలను బలహీనపర్చాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ రాజ్యాంగంపైనే దాడికి తెగబడుతున్నారని విమర్శించారు.
Read Also: జాతినుద్దేశించి మోదీ ప్రసంగం : ‘బిల్లు’పై కీలక వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

